చింతమనేని కేసులో న్యూ ట్విస్ట్

| Edited By:

Sep 05, 2019 | 10:40 AM

దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేసు కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. చింతమనేని తనను దూషించలేదని ఫిర్యాదుదారుడు జోసెఫ్ తెలిపాడు. ఈ మేరకు గ్రామస్తులకు ఫోన్ చేసి వివరణ ఇచ్చాడు. దీంతో టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సర్కార్ అక్రమ కేసులు నమోదు చేస్తోందని వారు గుంటూరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే తనను కులం పేరుతో చింతమనేని దూషించి, దాడి చేశాడని జోసెఫ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో […]

చింతమనేని కేసులో న్యూ ట్విస్ట్
Follow us on

దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేసు కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. చింతమనేని తనను దూషించలేదని ఫిర్యాదుదారుడు జోసెఫ్ తెలిపాడు. ఈ మేరకు గ్రామస్తులకు ఫోన్ చేసి వివరణ ఇచ్చాడు. దీంతో టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సర్కార్ అక్రమ కేసులు నమోదు చేస్తోందని వారు గుంటూరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

అయితే తనను కులం పేరుతో చింతమనేని దూషించి, దాడి చేశాడని జోసెఫ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అఙ్ఞాతంలోకి వెళ్లగా.. గత కొద్ది రోజులుగా చింతమనేని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన ఆచూకీ లభిస్తే ఎప్పుడైనా అరెస్ట్ చేయాలని పోలీసులు భావించారు. ఇలాంటి సమయంలో చింతమనేని తనను ఏమీ అనలేదని ఫిర్యాదుదారుడు వివరణ ఇవ్వడం గమనర్హం.