సీఎం జగన్ నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు: రోజా

కేబినెట్ కూర్పు అనంతరం తొలిసారిగా విజయవాడ వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రోజా.. కుల సమీకరణాల కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదనుకుంటున్నానని అభిప్రాయపడ్డారు. మంత్రి పదవి దక్కలేదన్న బాధ తనకు లేదన్నారు. తాను అలిగానన్నది కేవలం మీడియా ప్రచారం మాత్రమేనని రోజా చెప్పుకొచ్చారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి మంత్రులు ఉంటే సరిపోతుంది కదా.. ఎమ్మెల్యేలు ఎందుకని..? అందుకే తాను ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలిపారు. తనకు నామినేటెడ్ పదవి ఇస్తానని కూడా తనకు ఎవరూ చెప్పలేదని […]

సీఎం జగన్ నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు: రోజా

Updated on: Jun 11, 2019 | 4:38 PM

కేబినెట్ కూర్పు అనంతరం తొలిసారిగా విజయవాడ వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రోజా.. కుల సమీకరణాల కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదనుకుంటున్నానని అభిప్రాయపడ్డారు. మంత్రి పదవి దక్కలేదన్న బాధ తనకు లేదన్నారు. తాను అలిగానన్నది కేవలం మీడియా ప్రచారం మాత్రమేనని రోజా చెప్పుకొచ్చారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి మంత్రులు ఉంటే సరిపోతుంది కదా.. ఎమ్మెల్యేలు ఎందుకని..? అందుకే తాను ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలిపారు. తనకు నామినేటెడ్ పదవి ఇస్తానని కూడా తనకు ఎవరూ చెప్పలేదని రోజా పేర్కొన్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల కోసమే విజయవాడ వచ్చానన్న ఆమె.. మంత్రి పదవులు దక్కిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు