రాక్షసులు అడ్డుకుంటున్నారు-మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana Comments TDP : పేదలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంచి చేస్తుంటే ప్రతిపక్షం కుట్ర చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. లోకకళ్యాణం కోసం జరిగే తపస్సును రాక్షసులు అడ్డుకున్నాట్టు, కన్ను కుట్టిన ప్రతిపక్ష టీడీపి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అడ్డుకుంటోందని విమర్శించారు. భూ సేకరణ ద్వారా పేదలకు భూమి ఇచ్చేందుకు సిద్ధం అవుతుంటే ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తుందన్నారు. కోర్టులు నుంచి స్టే తీసుకు వచ్చి టీడీపీ కుట్రలు చేస్తోందని మంత్రి బొత్స […]

రాక్షసులు అడ్డుకుంటున్నారు-మంత్రి బొత్స

Updated on: Jul 06, 2020 | 8:12 PM

Minister Botsa Satyanarayana Comments TDP : పేదలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంచి చేస్తుంటే ప్రతిపక్షం కుట్ర చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. లోకకళ్యాణం కోసం జరిగే తపస్సును రాక్షసులు అడ్డుకున్నాట్టు, కన్ను కుట్టిన ప్రతిపక్ష టీడీపి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అడ్డుకుంటోందని విమర్శించారు. భూ సేకరణ ద్వారా పేదలకు భూమి ఇచ్చేందుకు సిద్ధం అవుతుంటే ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తుందన్నారు. కోర్టులు నుంచి స్టే తీసుకు వచ్చి టీడీపీ కుట్రలు చేస్తోందని మంత్రి బొత్స ఫైర్ అయ్యారు. టీడీపీ చేస్తున్న కుట్రలను ప్రజలను గమనిస్తున్నారని అన్నారు.

మొదట 25 లక్షలు అనుకున్నాం.., 30 లక్షలు పేదలకు ఇళ్ళు స్థలాలు ఇచ్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ సిద్ధమయ్యారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేదని ఎద్దేవ చేశారు. ఇది పేద ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వం అని మరోసారి గుర్తు చేశారు మంత్రి బొత్స.