Alla Ramakrishna Reddy : సీఎం జగన్ కు థ్యాంక్స్ చెప్పిన ఎమ్మెల్యే ఆర్కే.. చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్య

బకింగ్‌ హామ్‌ కెనాల్‌ రోడ్‌ను రూ. 200 కోట్లతో నాలుగు లైన్లుగా మార్చడానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి..

Alla Ramakrishna Reddy :  సీఎం జగన్ కు థ్యాంక్స్ చెప్పిన ఎమ్మెల్యే ఆర్కే.. చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్య
YCP MLA Alla Ramakrishnareddy

Updated on: Jul 24, 2021 | 2:17 PM

YCP MLA RK : బకింగ్‌ హామ్‌ కెనాల్‌ రోడ్‌ను రూ. 200 కోట్లతో నాలుగు లైన్లుగా మార్చడానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆమోదం తెలిపారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. తెనాలి నుంచి మంగళగిరి నేషనల్ హైవే రోడ్డు వరకు నిర్మించబోయే రోడ్డుకు త్వరలో టెండర్లు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.

దుగ్గిరాల మండలంలో 18 గ్రామాల్లో రూ.70 నుంచి రూ. 80 కోట్లతో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు.  దుగ్గిరాల మండలాన్ని రూ. 400 కోట్లతో అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపిన సీఎం వైయ‌స్ జగన్‌కు ఎమ్మెల్యే ఆర్కే ధన్యవాదాలు తెలిపారు.

అటు, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆమోదం తెల‌ప‌డం ప‌ట్ల శనివారం మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.

Read also : Mantralayam : మంత్రాలయంలో సెక్కూరిటీ సిబ్బంది ఓవరేక్షన్, భక్తుడిని చితకబాదిన..