AP Awards: గ్రామ సచివాలయాల పనితీరుకు అంతర్జాతీయ గుర్తింపు, గిరిజ‌న సంక్షేమ శాఖ‌కు ఐదు జాతీయ అవార్డులు

|

Aug 05, 2021 | 10:00 PM

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పని తీరుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పల్లె.. పట్టణం అని తేడా లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణలో సిబ్బంది కనబరుస్తున్న..

AP Awards:  గ్రామ సచివాలయాల పనితీరుకు అంతర్జాతీయ గుర్తింపు, గిరిజ‌న సంక్షేమ శాఖ‌కు ఐదు జాతీయ అవార్డులు
Andrhra Pradesh
Follow us on

Village secretariats – Tribal Welfare: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పని తీరుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పల్లె.. పట్టణం అని తేడా లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణలో సిబ్బంది కనబరుస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. కార్పొరేట్ కార్యాలయాలకు సైతం ఎక్కడా తీసిపోని విధంగా గ్రామ సచివాలయాల తీరుతెన్నులు మారుతున్నాయి.

ఒకప్పుడు రేషన్ కార్డు కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరిగే పరిస్థితి నుండి నిమిషాల వ్యవధిలోనే స్వయంగా ఇంటికే వచ్చి చేరుతున్నాయి. కృష్ణా జిల్లాలో అత్యంత పారదర్శకంగా అత్యుత్తమ సేవలు అందిస్తున్న 98 గ్రామ, 16 వార్డు సచివాలయం ప్రతిష్ఠాత్మక ఐ.ఎస్.ఓ 9001 గుర్తింపు లభించింది.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ గిరిజ‌న సంక్షేమ శాఖ‌కు ఐదు జాతీయ అవార్డులు సిద్ధించాయని డిప్యూటీ సీఎం పుష్పశ్రీ‌వాణి వెల్లడించారు. దేశంలోనే మూడు నంబ‌ర్ వ‌న్ అవార్డులు జీసీసీ సాధించిన‌ట్లు తెలిపారు. వ‌న్ ధ‌న్ యోజ‌న‌లో ఏపీకి మొద‌టి స్థానం, చిన్న త‌ర‌హా అట‌వీ ఉత్పత్తులు, క‌నీస మ‌ద్ధతు ధ‌ర క‌ల్పన‌లో ప్రథ‌మ స్థానం, సేంద్రియ ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్‌లో కూడా మొద‌టి స్థానంలో గిరిజ‌న సంక్షేమ శాఖ నిలిచింద‌ని మంత్రి తెలిపారు.

Read also: Facebook Cheating: ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి గీత నారాయణ్ పేరుతో పరిచయం.. రూ.11 కోట్లు కొట్టేశారు