Breaking: ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు.. వారి డబ్బు వాపస్

ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

Breaking: ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు.. వారి డబ్బు వాపస్

Updated on: Jun 20, 2020 | 5:54 PM

ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కరోనా విస్తరణ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే నెలలో నిర్వహించాలనుకున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు 2019-2020 విద్యాసంవత్సరంలో ఫెయిల్ అయిన ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులను పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సప్లిమెంటరీ ఫీజు ఇచ్చిన వారికి వెనక్కి ఇచ్చేస్తామని విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. అయితే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ యథాతథంగా జరుగుతాయని.. విద్యార్థులు ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చునని అన్నారు.

Read This Story Also: Big Breaking: ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

Loading...
Unable to load recommendations.
Follow Us