Big Breaking: ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేయగా.. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంది.

Big Breaking: ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 7:09 PM

పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేయగా.. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సురేష్ వెల్లడించారు. పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించాలని పక్కా ప్రణాళిక చేశామని, ఆన్‌లైన్‌లో క్లాస్‌లు చెప్పించామని, పేపర్లను తగ్గించామని, పరీక్షల కోసం అందరినీ సమన్వయం చేశామని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రద్దు చేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక విద్యార్థుల గ్రేడింగ్ విధానాన్ని త్వరలో ప్రకటిస్తామని సురేష్ వెల్లడించారు. కాగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6,30,804 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వారందరు ఎలాంటి పరీక్ష లేకుండానే పాసయ్యారు.

కాగా ఇదివరకే రెండుసార్లు పరీక్షలు వాయిదా పడగా.. జూలైలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని సురేష్ ఈ మధ్యన కూడా వెల్లడించారు. అందులో ఎలాంటి మార్పు ఉండదని ఆయన పేర్కొన్నారు. జూలై 10 నుంచి పరీక్షలు ఉండనున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఈ నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. కరోనా రోజు రోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో పిల్లల ఆరోగ్యాల గురించి ఆలోచించాలని ప్రతిపక్ష నేతలు విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే.

Read This Story Also: ‘మ్యూజిక్ ఇండస్ట్రీ’లోనూ ఆత్మహత్యలు జరగొచ్చు: సోనూ నిగమ్