మారుతి సుజుకీ నుంచి కొత్త వెర్షన్ కారు.. గరిష్ట ధర ఎంతో తెలుసా..?

11 May 2024

TV9 Telugu

కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ.. హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో పోటీని మరింత తీవ్రతరం చేయడంలో భాగంగా నూతన జనరేషన్‌ స్విఫ్ట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

మారుతి సుజుకీ 

ఈ కారు 6.49 లక్షల రూపాయల నుంచి 9.64 లక్షల రూపాయల గరిష్ఠ ధరల్లో లభించనుంది. నాలుగు విభాగాల్లో ఈ కారు లభించనుంది.

కారు ధర

ఈ కారు ఎల్‌ఎక్స్‌ఐ మాడల్‌ ధర 6.49 లక్షల రూపాయలు, వీఎక్స్‌ఐ 7,29,500 రూపాయల నుంచి రూ.7,79,500.

ఎల్‌ఎక్స్‌ఐ మాడల్‌ 

వీఎక్స్‌ఐ(వో) ధర 7.56 లక్షల రూపాయల నుంచి 8.06 లక్షల రూపాయలు, జెడ్‌ఎక్స్‌ఐ ధర 8,29,500 రూపాయల నుంచి 8,79,500 రూపాయలు విక్రయిస్తోంది. ఇవి ఢిల్లీ షోరూం ధరలు.

వీఎక్స్‌ఐ(వో) ధర

ఈ సందర్భంగా మారుతి సుజుకీ ఎండీ, సీఈవో హిసాషీ తకేచి మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ఎంట్రీ లెవల్‌ కార్లకు భవిష్యత్తులోనూ డిమాండ్‌ ఉంటుందని అన్నారు.

ఎంట్రీ లెవల్‌ కార్లు

మొత్తం వాహన విక్రయాల్లో వీటి వాటా 28 శాతంగా ఉండటంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆయన చెప్పారు. 

వాహన విక్రయాల్లో

ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ స్విఫ్ట్‌ తయారు చేయడానికి సంస్థ రూ.1,450 కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్లు  సీఈవో తెలిపారు.

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ 

ప్రస్తుతం భారత్‌లో ఏటా 7 లక్షల ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కార్లు అమ్ముడవుతుండగా, 2030 నాటికి 10 లక్షలకు చేరుకునే అవకాశం ఉందన్నారు.

హ్యాచ్‌బ్యాక్‌ కార్లు