అవినీతి నిర్మూలన ఎలా..: సీఎం జగన్‌కి ఐఐఎం నివేదిక

ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు సంబంధించి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక సమర్పించింది

అవినీతి నిర్మూలన ఎలా..: సీఎం జగన్‌కి ఐఐఎం నివేదిక

Edited By:

Updated on: Aug 25, 2020 | 7:19 AM

IIM Ahmedabad report YS Jagan: ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు సంబంధించి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో పలు విషయాలను వెల్లడించింది. అందులో కీలకమైన ప్రభుత్వ శాఖల్లో సంస్కరణలు అవసరమని పేర్కొన్న ఐఐఎం.. ఏసీబీ క్లియరెన్స్‌తో ప్రభుత్వ శాఖల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించే ఉన్నతాధికారులకు పోస్టింగ్ ఇవ్వాలని సూచించింది. అలాగే అధికారులకు బాధ్యతలు స్వల్పకాలికంగా నిర్దిష్ట సమయం వరకే ఇవ్వాలని సూచించింది.  అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని.. ప్రజలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌లో ఉండాలని ఐఐఎం నివేదికలో తెలిపింది. ఇక రికార్డులు అన్ని డిజిటలైజేషన్ చేయాలని వివరించింది.

వీటితో పాటు రెవెన్యూ శాఖలో అవినీతి నిర్మూలనకు ఐఐఎం కీలక ప్రతిపాదనలు చేసింది. రెవెన్యూ రికార్డుల సవరణలు కారణంగా అవినీతికి ఆస్కారం ఉందని, ఆ ఆస్కారం లేకుండా డిజిటలైజేషన్ దిశగా సాగాలని ఐఐఎం నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలో బిపిఎస్ లాంటి పథకాలు పూర్తిగా రద్దు చేయాలని సూచించింది. ఇక పాలనా వ్యవహారాల్లో మాఫియా, రాజకీయ నేతలతో పాటు మీడియా జోక్యాన్ని కూడా దూరం పెట్టాలని కమిటీ పేర్కొంది. అవినీతి నిర్మూలనకు మీడియాను కూడా దూరం పెట్టాలని, ప్రజా విశ్వాసాన్ని తిరిగి చూరగోనెలా భాగస్వామ్య ప్రభుత్వం ఉండాలని ఐఐఎం తెలిపింది. ఇక ఈ నివేదిక ఆధారంగా త్వరలో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకొనబోతున్నట్లు సమాచారం.

Read More:

వరద బాధితులకు ఏపీ సర్కార్ చేయూత..!

ఆన్లైన్ తరగతులకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..