లాక్‌డౌన్‌ తరువాత ఏపీలో ఆర్టీసీ బస్సులు ఇలా ఉండబోతున్నాయా..!

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో రవాణా స్తంభించింది. లాక్‌డౌన్‌ 3.0 ఇవాళ్టి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో గ్రీన్ జోన్లలో బస్సులు తిరిగేందుకు కేంద్రం అనుమతిని ఇచ్చింది.

లాక్‌డౌన్‌ తరువాత ఏపీలో ఆర్టీసీ బస్సులు ఇలా ఉండబోతున్నాయా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 04, 2020 | 3:05 PM

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో రవాణా స్తంభించింది. లాక్‌డౌన్‌ 3.0 ఇవాళ్టి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో గ్రీన్ జోన్లలో బస్సులు తిరిగేందుకు కేంద్రం అనుమతిని ఇచ్చింది. అయితే ప్రస్తుతం విజయనగరం జిల్లా ఒక్కటే గ్రీన్‌ జోన్లో ఉండగా.. వారం తరువాత మరిన్ని జిల్లాలో ఆ జోన్‌లో చేరిన తరువాత బస్సు సర్వీసులు పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే బస్సులు ఎప్పుడు పునరుద్ధరించినా.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా బస్సుల్లో సామాజిక దూరాన్ని మెయింటెన్ చేసేలా ప్రభుత్వం ఆలోచిస్తోందట. ఈ క్రమంలో సోషల్ డిస్టేన్స్‌ ఉండే విధంగా ప్రభుత్వం బస్సుల్లో సీటింగ్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే మూడో దశ లాక్‌డౌన్ మే 17తో ముగియనున్న విషయం తెలిసిందే. కాగా ఏపీలో కరోనా కేసుల విస్తరణ ఆగడం లేదు. తాజాగా 67కొత్త కేసులు నమోదయ్యాయి.

Read This Story Also: చెర్రీకి భారత స్టార్ బాక్సర్‌ పాఠాలు.. ఫొటో వైరల్..!