New Ration Cards: ఏపీ వాసులకు గుడ్‌ న్యూస్‌.. రేషన్ కార్డుల జారీపై కీలక అప్‌డేట్!

రేషన్‌ కార్డు జారీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారు ఇప్పుడు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గతంలో వచ్చిన 3.36 లక్షల దరఖాస్తులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 15 నుంచి ‘మనమిత్ర’ అనే వాట్సాప్ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు అధికారులు.

New Ration Cards: ఏపీ వాసులకు గుడ్‌ న్యూస్‌.. రేషన్ కార్డుల జారీపై కీలక అప్‌డేట్!
Ap Ration Card

Updated on: May 11, 2025 | 3:14 PM

2024 ఎన్నిలకల్లో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఇటీవలే రాజధాని అమరావృతి నిర్మాణపనులను ప్రారంభించింది కూటమి ప్రభుత్వం పాలనలో తమదైన మార్క్‌ను చూపిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్‌ హామీల్లో ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేస్తోన్న సర్కార్.. మిగతా హామీల అమలు దశిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రేషన్‌ కార్డుల జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి కీలక అప్‌డేట్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారు ఇప్పుడు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గతంలో వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలిస్తోందని.. వానిటి క్షుణ్నంగా పరిశీలించి అర్హులైన వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

అయితే త్వరలోనే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నెల 15 నుంచి ‘మనమిత్ర’ అనే వాట్సాప్ సేవ ద్వారా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను అధికారులు స్వీకరించనున్నారు. ఈ అప్లికేషన్లను పరిశీలించి జూన్‌లో కొత్త రేషన్ కార్డుల మంజూరు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..