నా కుటుంబాన్ని నాశనం చేసేందుకు యత్నించారు: బాబుపై సంచలన ఆరోపణలు

ఆయన స్వార్థం కోసం తన కుటుంబాన్ని నాశనం చేసేందుకు చంద్రబాబు యత్నించారని మాజీ మంత్రి, వైసీపీ నేత రామసుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

నా కుటుంబాన్ని నాశనం చేసేందుకు యత్నించారు: బాబుపై సంచలన ఆరోపణలు

Edited By:

Updated on: Mar 12, 2020 | 9:27 PM

ఆయన స్వార్థం కోసం తన కుటుంబాన్ని నాశనం చేసేందుకు చంద్రబాబు యత్నించారని మాజీ మంత్రి, వైసీపీ నేత రామసుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కడప జిల్లాకు చెందిన రామసుబ్బారెడ్డి.. టీడీపీకి రాజీనామా చేసి బుధవారం వైసీపీ కండువాను కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు గురించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. నమ్ముకున్న వారిని చంద్రబాబు నట్టేట ముంచారని.. 2014లో ప్రజలు పట్టం కడితే కుట్రలు కుతంత్రాలకు తెరలేపారని ఆయన అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటని.. ఎన్టీఆర్ బతికి ఉంటే ఆయన ఆత్మ క్షోభించేదని ఆరోపించారు. నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడు చంద్రబాబని.. ఆయన విధానాల వలనే పార్టీ వీడాల్సి వచ్చిందని రామసుబ్బారెడ్డి అన్నారు.