కృష్ణానదికి తగ్గుతున్న వరద ఉధృతి

| Edited By:

Aug 18, 2019 | 12:11 PM

ఎట్టకేలకు కృష్ణానదికి వరద ఉధృతి దగ్గింది. ఆదివారం ఉదయం ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 6.26 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఆదివారం నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహం తగ్గుతూ కనిపించింది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టంతో 3.07 టీఎంసీ నీరు నిల్వ ఉంది. మరోవైపు ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో శనివారం వరద ప్రవాహం తగ్గిన […]

కృష్ణానదికి తగ్గుతున్న వరద ఉధృతి
Follow us on

ఎట్టకేలకు కృష్ణానదికి వరద ఉధృతి దగ్గింది. ఆదివారం ఉదయం ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 6.26 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఆదివారం నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహం తగ్గుతూ కనిపించింది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టంతో 3.07 టీఎంసీ నీరు నిల్వ ఉంది.

మరోవైపు ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో శనివారం వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో ప్రవాహంలో తగ్గుదల కనిపించింది. బ్యారేజీ నుంచి విడుదలవుతున్న నీటిని తూర్పు డెల్టాకు 9467 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
బ్యారేజీలో నిల్వ సామర్థ్యం కంటే అధికంగా నీరు ఉండటంతో 70 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద ప్రవాహం ఆరు లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉన్నట్లు బ్యారేజీ కన్జర్వేటర్‌ తెలిపారు.

కృష్ణా జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో పలువురు నేతలు పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.