ఏపీ వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఎన్నికల కమిషన్ కోడ్ నుంచి మినహాయింపునిచ్చింది. ఫొని తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా సోమిరెడ్డి నిర్వహించిన సమీక్షలకు అధికారులెవరూ హాజరు కాలేదు. ఎన్నికల కోడ్ ఉండటంతో అధికారులంతా గైర్హాజరయ్యారు.
రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో పంట నష్టం, కరవు తదితర ప్రకృతి వైపరీత్యాలపై సమీక్ష నిర్వహించుకునేందుకు తాజాగా ఈసీ అనుమతి ఇచ్చింది. దీంతో శుక్రవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లోనే సోమిరెడ్డి సంబంధిత శాఖాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈసీ అనుమితినిచ్చిన నేపథ్యంలో ఈ సమావేశానికి వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులతో పాటు ప్రత్యేక కమిషనర్లు కూడా హాజరు కానున్నారు.