రాయలసీమ ఎత్తిపోతల పథకం.. ఏపీతో ఏకీభవించిన కేంద్రం

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై ఏపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది కేంద్రం. ఈ పథకం పనులకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ తేల్చింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం.. ఏపీతో ఏకీభవించిన కేంద్రం
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2020 | 7:44 AM

Rayalaseema Ethipothala Project: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై ఏపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది కేంద్రం. ఈ పథకం పనులకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ తేల్చింది. దీని వలన పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవని స్పష్టం చేస్తూ.. జాతీయ హరిత న్యాయస్థానం(ఎన్జీటీ) దక్షిణ ప్రాంత బెంచ్‌(చెన్నై)కి నివేదిక ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతలపై ఆగష్టు 11న ఎన్జీటీ నిర్వహించే తుది విచారణలో.. కేంద్రం ఇచ్చిన ఈ నివేదిక కీలకం కానుంది. దీంతో ఈ పథకానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

కాగా కృష్ణా నదీ జలాల్లో తమ వాటాగా దక్కిన నీటిని వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలను తీర్చాలని ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకంను చేపట్టింది. అయితే పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులను నిలిపేయాలంటూ తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన ఓ వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని మే 20 విచారించిన ఎన్జీటీ.. ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయాలంటూ స్టే ఇచ్చింది. దీంతో ఎన్జీటీలో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం.. తన వాటా జలాలను వినియోగించుకోవడానికే ఎత్తిపోతల పనులను చేపట్టామని తెలిపింది. దీని వలన పర్యావరణంపై ఎలాంటి ప్రతిపకూల ప్రభావం పడదని వెల్లడించింది. ఇక ప్రభుత్వ పిటిషన్‌పై ఈ నెల 13న విచారించిన ఎన్జీటీ, ఎత్తిపోతల పనుల టెండర్‌ ప్రక్రియ చేపట్టడానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: జక్కన్నా.. త్వరగా కోలుకోండి