మీ త్యాగాలు మరువలేనివి.. పోలీసులకు డీజీపీ భావోద్వేగ లేఖ..!

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను అన్ని రాష్ట్రాలు సమర్ధవంతంగా పాటిస్తున్నాయి.

మీ త్యాగాలు మరువలేనివి.. పోలీసులకు డీజీపీ భావోద్వేగ లేఖ..!
Follow us

| Edited By:

Updated on: Mar 31, 2020 | 7:27 PM

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను అన్ని రాష్ట్రాలు సమర్ధవంతంగా పాటిస్తున్నాయి. ఈ లాక్‌డౌన్‌లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు పోలీసులు. ప్రజలెవరు బయటకు రాకుండా వారు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో నిరంతర సేవలు అందిస్తోన్న పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

”మీరు చేస్తున్న సేవలు ఆపారమైనవి. రక్షక భటుడు అనే పేరుకు సార్ధకత జరుగుతోంది. నిజంగా మీరు ప్రజా రక్షక భటులు. ప్రజా ప్రాణరక్షణే కర్తవ్యంగా భావించి సేవలందిస్తున్న మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. కరోనా కట్టడికి విధులు నిర్వహిస్తున్న పోలీసులకి, వారికి అండగా నిలుస్తున్న కుటుంబాలకు ప్రత్యేక అభినందనలు. పోలీస్ కుటుంబాలు పరోక్షంగా చేస్తున్న త్యాగాలు మరువలేనివి. కరోనా మహమ్మారిని తరిమి కొట్టే క్రమంలో ఇంకా చాలా పని ఉంది. అతి త్వరలో ఈ వైరస్‌ను తరిమి కొడతామని పోలీసుల తరఫున రాష్ట్ర ప్రజానీకానికి నేను మాట ఇస్తున్నా” అని సవాంగ్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.

Read This Story Also: కరోనా కాదు.. అందుకే ఆసుపత్రికి వెళ్లా..!