ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు.. ఏపీ సీఎం జగన్ భారీ సహాయం అందించనున్నారు. వైఎస్ జగన్.. పాదయాత్రలో భాగంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు.. ప్రకటించిన దానికన్నా.. స్కూలు బ్యాగు, నోట్ బుక్స్ అదనంగా ఇవ్వనుంది ప్రభుత్వం.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న పిల్లలకు స్కూల్ బ్యాగు, నోట్‌బుక్స్, టెస్ట్ బుక్స్, 3 జతల యూనిఫారమ్స్, జత షూస్, సాక్సులు అందించనుంది. అంతేకాకుండా.. యూనిఫారమ్స్ కుట్టించుకునేందుకు.. అదనంగా డబ్బులు కూడా ఇవ్వనుంది ఏపీ సర్కార్. పాఠశాలలు తెరిచేనాటికి అందించాలని.. అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లల్లో కొత్త ప్రణాళికను తయారు చేయడంపై జగన్ అధికారులతో చర్చ కూడా చేపట్టారు.
వచ్చే ఏడాది 1వ తరగతి నుంచి 6 వరకూ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టబోతున్నామని.. దీనికి పిల్లలను సన్నద్ధం చేయాలని చెప్పారు. వారికి ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని అధికారులను సూచించారు సీఎం. విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నెలరోజులు పిల్లలకు బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తామని.. సీఎంకు తెలిపారు అధికారులు. అన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.