ఫొని తుఫాను.. సెక్రటేరియట్‌కు చంద్రబాబు

| Edited By:

May 02, 2019 | 12:24 PM

13రోజుల విరామం తరువాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయానికి వస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆయన ఇన్ని రోజులు సచివాలయానికి దూరంగా ఉన్నారు. అయితే ఫొని తుఫాన్ అత్యవసర పరిస్థితుల దృష్ట్యా తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేయాలని కోరుతూ చంద్రబాబు.. కేంద్ర ఎన్నికల సంఘానికి బుధవారం లేఖ రాశారు. తుఫానుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీర ప్రాంతాల ప్రజలకు చేరవేసేందుకు, మానవ వనరుల సమీకరణ, ఇతర […]

ఫొని తుఫాను.. సెక్రటేరియట్‌కు చంద్రబాబు
Follow us on

13రోజుల విరామం తరువాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయానికి వస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆయన ఇన్ని రోజులు సచివాలయానికి దూరంగా ఉన్నారు. అయితే ఫొని తుఫాన్ అత్యవసర పరిస్థితుల దృష్ట్యా తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేయాలని కోరుతూ చంద్రబాబు.. కేంద్ర ఎన్నికల సంఘానికి బుధవారం లేఖ రాశారు.

తుఫానుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీర ప్రాంతాల ప్రజలకు చేరవేసేందుకు, మానవ వనరుల సమీకరణ, ఇతర నష్ట నివారణ చర్యలను చేపట్టేందుకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించకపోగా.. ఫొనిపై అధికారులతో సమీక్ష చేసేందుకు చంద్రబాబు సెక్రటేరియట్‌కు వెళ్తున్నారు.