అమరావతి: ఏపీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పయ్యావులను ఎంపిక చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పీఏసీ ఛైర్మన్ పదవికి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప, సీనియర్ నేత కరణం బలరాం, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, అనగాని సత్యప్రసాద్, గణబాబు రేసులో ఉన్నప్పటికీ.. పయ్యావుల కేశవ్‌నే చంద్రబాబు ఫైనల్ చేశారు. ఇవాళ నేతలందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవిలో ఉన్నవారికి కేబినెట్ ర్యాంక్ వర్తింస్తుంది. కాగా గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పీఏసీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.