బ్రేకింగ్: టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు!

|

Dec 31, 2019 | 10:06 AM

టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.300 కోట్లను లోన్ తీసుకున్న రాయపాటి మోసం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అంతేకాకుండా ట్రాన్స్‌ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్ ఇంట్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కావూరి హిల్స్‌లో రాయపాటి ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ […]

బ్రేకింగ్: టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు!
Follow us on

టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.300 కోట్లను లోన్ తీసుకున్న రాయపాటి మోసం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అంతేకాకుండా ట్రాన్స్‌ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్ ఇంట్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని కావూరి హిల్స్‌లో రాయపాటి ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ కార్యాలయం ఉండగా.. గతంలో ఈ కంపెనీ పోలవరం ప్రాజెక్ట్ పనులను చేసింది.  విజయవాడ, బెంగళూరు, చెన్నై, గుంటూరులోని ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. బ్యాంక్‌ను మోసం చేశారన్న దానిపై సీబీఐ గతంలోనే రాయపాటిపై కేసు నమోదు చేసిన సంగతి విదితమే. కాగా, తాజాగా సోదాలు జరుగుతుండటంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.