జగన్ ఇంటి ముందు బీమా మిత్ర ఉద్యోగుల నిరసన

| Edited By: Srinu

Jul 02, 2019 | 5:27 PM

కొన్నేళ్లుగా తమకు ఎలాంటి జీతభత్యాలు ఇవ్వలేదని ఆరోపిస్తూ బీమా మిత్ర ఉద్యోగులు తాడేపల్లిలోని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు నిరసనకు దిగారు.13 జిల్లాలకు చెందిన సిబ్బంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 2007 నుంచి తాము బీమా మిత్రులుగా కొనసాగుతున్నా.. ఇంతవరకు ఎలాంటి జీతాలు తమకు అందలేదని వారు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆమ్ ఆద్మీ, అభయహస్తం, జనశ్రీ బీమా పథకాల వలన వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని.. […]

జగన్ ఇంటి ముందు బీమా మిత్ర ఉద్యోగుల నిరసన
Follow us on

కొన్నేళ్లుగా తమకు ఎలాంటి జీతభత్యాలు ఇవ్వలేదని ఆరోపిస్తూ బీమా మిత్ర ఉద్యోగులు తాడేపల్లిలోని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు నిరసనకు దిగారు.13 జిల్లాలకు చెందిన సిబ్బంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 2007 నుంచి తాము బీమా మిత్రులుగా కొనసాగుతున్నా.. ఇంతవరకు ఎలాంటి జీతాలు తమకు అందలేదని వారు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆమ్ ఆద్మీ, అభయహస్తం, జనశ్రీ బీమా పథకాల వలన వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని.. కానీ గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేరే ఆధారం లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు వాపోయారు. దీనిపై సీఎం జగన్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.