ఆయనతో మాకేం అవసరం.. జేసీకి మంత్రి స్ట్రాంగ్ కౌంటర్

| Edited By:

Nov 08, 2019 | 7:48 AM

వైసీపీలోకి చేరమని తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రవాణా శాఖ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీలోకి రావాలని జేసీని ఎవ్వరూ ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. రాజకీయంగా చివరి దశలో ఉన్న జేసీని ఆహ్వానించాల్సిన అవసరం ఏముందని నాని ప్రశ్నించారు. ఇక దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్ విషయంపైనా మంత్రి స్పష్టతను ఇచ్చారు. బస్సుల సీజ్ విషయంలో ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నడుచుకుంటోందని.. తెలిసిన వారు కదా […]

ఆయనతో మాకేం అవసరం.. జేసీకి మంత్రి స్ట్రాంగ్ కౌంటర్
Follow us on

వైసీపీలోకి చేరమని తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రవాణా శాఖ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీలోకి రావాలని జేసీని ఎవ్వరూ ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. రాజకీయంగా చివరి దశలో ఉన్న జేసీని ఆహ్వానించాల్సిన అవసరం ఏముందని నాని ప్రశ్నించారు. ఇక దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్ విషయంపైనా మంత్రి స్పష్టతను ఇచ్చారు. బస్సుల సీజ్ విషయంలో ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నడుచుకుంటోందని.. తెలిసిన వారు కదా అని ఫైన్లు తగ్గించలేం కదా అంటూ తెలిపారు.

అయితే దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్ విషయంపై జేసీ మాట్లాడుతూ.. వైసీపీలోకి వెళ్తే తనపై నమోదైన కేసులన్నీ క్షణంలో మాయమౌతాయంటూ ఓ వైసీపీ తనను ఆహ్వానించారంటూ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కొందరు నేతలను టార్గెట్ చేసుకున్నారని ఆరోపించిన జేసీ.. తమ ట్రావెల్స్‌కు చెందిన 80 బస్సులను సీజ్ చేశారని వాపోయారు. ట్రాన్స్‌పోర్ట్‌లో తమకు 74ఏళ్ల అనుభవం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ట్రిబ్యునల్ వదిలిపెట్టమని చెప్పినా ఆర్టీవో అధికారులు తమ బస్సులను వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పినట్లు వినకపోతే.. ఎల్వీలాగా తమను బదిలీ చేస్తారని అధికారులు భయపడుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. జగన్ హద్దు మీరుతున్నారంటూ జేసీ మండిపడ్డారు.