ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పెను ప్రమాదం తప్పింది. కర్నూల్ జిల్లాలో అనిల్ కుమార్ పర్యటిస్తుండగా.. బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆయన బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. వెంటనే వారందరూ పరుగులు తీసినప్పటికీ.. మంత్రి గన్‌మెన్లు సహా 50మందికి పైగా గాయాలు అయ్యాయి. వారందరిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అనిల్ కుమార్ కారులో కూర్చొని ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డట్లు సమాచారం.