
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు భద్రతను ఏపీ ప్రభుత్వం మరింత కుదించింది. గతంలో చంద్రబాబుకు ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ సహా.. ముగ్గురు ఆర్‌ఐ బృందాలతో భద్రత కల్పించేవారు. అయితే తాజాగా ప్రభుత్వం అందరిని తొలగించి కేవలం ఇద్దరేసి కానిస్టేబుళ్ల చొప్పున 3 బృందాలను కేటాయించారు. కాగా దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందని వారు మండిపడుతున్నారు.