Maritime India Summit 2021 : దేశ, విదేశాల నుంచి తరలిరండి.. ఏపీలో పెట్టుబడులు పెట్టండి, మారిటైం సమ్మిట్ లో సీఎం పిలుపు

Maritime India Summit 2021 : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నంబర్ 1 గా ఉండడాన్ని గర్విస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పోర్ట్ మౌలిక సదుపాయాలు, సపోర్ట్ ఎకో సిస్టమ, పోర్ట్ అధారిత ..

Maritime India Summit 2021 : దేశ, విదేశాల నుంచి తరలిరండి.. ఏపీలో పెట్టుబడులు పెట్టండి, మారిటైం సమ్మిట్ లో సీఎం పిలుపు

Updated on: Mar 02, 2021 | 1:29 PM

Maritime India Summit 2021 : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నంబర్ 1 గా ఉండడాన్ని గర్విస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పోర్ట్ మౌలిక సదుపాయాలు, సపోర్ట్ ఎకో సిస్టమ్, పోర్ట్ అధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా అది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన వర్చువల్ గా మారిటైం ఇండియా సమ్మిట్ 2021 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏపీలో ఒక మేజర్ పోర్ట్ విశాఖపట్నంలో, 5 రాష్ట్ర పోర్టులు, 10 నోటిఫైడ్ పోర్ట్ లు ఉన్నాయని సీఎం చెప్పారు. ఏపీకి 170 మిలియన్ టన్నుల కార్గో సామర్ధ్యం ఉందని సీఎం ఈ సందర్బంగా చెప్పారు. జాతీయ ఎగుమతుల్లో ఏపీ వాటా 4 శాతమని, ఆ మొత్తాన్ని 2030 నాటికి 10 శాతానికి పెంచాలని సంకల్పంతో ఉన్నామని జగన్ అన్నారు.

పోర్ట్ లను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అనేక పరిశ్రమలు వస్తున్నాయని, ఈ నేపథ్యం లో మరో మూడు గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భవనపాడులో పోర్టులు అభివృద్ధి చేస్తున్నామని, 2023 నుండి ఆ పోర్టులు కార్యకలాపాలు ప్రారంభిస్తాయని స్పష్టం చేశారు. దీనితో మరో 100 మిలియన్ టన్నుల కార్గో కెపాసిటీ పెరుగుతుందన్నారు. కేంద్ర సహకారంతో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు 8 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి సాగుతుందని కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. దేశ, విదేశాలనుంచి భారీ ఎత్తున పెట్టుబడిదారులు ఈ సమ్మిట్ లో పాల్గొనాలని, ఏపీలో పెట్టుబడులు పెట్లాలని కూడా ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి  :   Nallamalla Reserve Forest Fire : నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్‌ చుట్టుముట్టి ఎగిసిపడుతోన్న మంటలు

రేషన్‌ వాహనాల రంగుల మార్పుపై వెనక్కి తగ్గిన ఎస్ఈసీ, తాజా నిర్ణయంతో ప్రభుత్వ పిటిషన్‌ను క్లోజ్‌ చేసిన ఏపీ హైకోర్టు