ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ వరం..

ఏపీలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో సీఎం మరో కీలక హామీని నెరవేర్చారు. ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్ అందించారు. ఇచ్చిన మాటలకు అనుగుణంగా..

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ వరం..
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 12:19 PM

ఏపీలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో సీఎం మరో కీలక హామీని నెరవేర్చారు. ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్ అందించారు. ఇచ్చిన మాటలకు అనుగుణంగా ఏపీలోని ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ (ఆప్కాస్)ని ఏర్పాటు చేశారు సీఎం జగన్. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఎంతో మంది కాంట్రాక్టు ఉద్యోగులు నా వద్దకు వచ్చి వారి బాధలను పంచుకున్నారు. ఇస్తామన్న జీతాలు ఇవ్వకుండా కోతలు విధించారని విలపించారు. అందుకే అప్పుడు వారికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్‌ని ఏర్పాటు చేశాం.

అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకే కేటాయింపు ఉంటుందన్నారు. ఔట్ సోర్సింగ్ వ్యవస్థను మార్చుతాం. ఎవరికీ లంచాలు ఇవ్వకుండా ఉద్యోగాలు రావాలి. కొర్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సెడ్ సర్వీసెస్ చైర్మన్‌గా సాధారణ పరిపాలన శాఖకి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి వ్యవహరిస్తారు. దీంతో అవినీతి జరగడానికి అవకాశం ఉండదని పేర్కొన్నారు సీఎం జగన్.

Read More:

ప్రగతి భవన్‌లో కరోనా కలకలం.. నలుగురు సిబ్బందికి కోవిడ్..

పీఎఫ్ విత్‌డ్రా చేసుకున్నారా? పన్ను పడే ఛాన్స్ ఉందట!

Latest Articles
నామినీ ఇక ఆప్షనల్.. జాయింట్ అకౌంట్ హోల్డర్లకు వెసులుబాటు
నామినీ ఇక ఆప్షనల్.. జాయింట్ అకౌంట్ హోల్డర్లకు వెసులుబాటు
'చంద్రబాబుది ఊరసవెల్లి రాజకీయం'.. సింహపురి ఎన్నికల ప్రచారంలో జగన్
'చంద్రబాబుది ఊరసవెల్లి రాజకీయం'.. సింహపురి ఎన్నికల ప్రచారంలో జగన్
బెల్లం కలిపిన పాలు తాగితే సూపర్ బెనిఫిట్స్
బెల్లం కలిపిన పాలు తాగితే సూపర్ బెనిఫిట్స్
అప్పుడే పెళ్లెందుకు అనుకుంటున్నారా..? లేట్ అయితే లాసే..
అప్పుడే పెళ్లెందుకు అనుకుంటున్నారా..? లేట్ అయితే లాసే..
మీలో ఈ లక్షణాలున్నాయా.? ఒమేగా-3 లోపం ఉన్నట్లే..
మీలో ఈ లక్షణాలున్నాయా.? ఒమేగా-3 లోపం ఉన్నట్లే..
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రిష్ 4 వచ్చేస్తున్నాడు..
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రిష్ 4 వచ్చేస్తున్నాడు..
గుడ్డు.. వెరీగుడ్డు.. గాడిద గుడ్డు.. తెలంగాణలో పొలిటికల్ హీట్..
గుడ్డు.. వెరీగుడ్డు.. గాడిద గుడ్డు.. తెలంగాణలో పొలిటికల్ హీట్..
అతి తక్కువ ధరకే 1GBPS వేగంతో ఇంటర్నెట్.. బీఎస్ఎన్ఎల్ నుంచి..
అతి తక్కువ ధరకే 1GBPS వేగంతో ఇంటర్నెట్.. బీఎస్ఎన్ఎల్ నుంచి..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?