Somu Veerraju: విద్యుత్ చార్జీలపై ముఖ్యమంత్రి జగన్ మడమ తిప్పారు..! బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు

|

Sep 13, 2021 | 9:42 PM

విద్యుత్ చార్జీల హామీపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Somu Veerraju: విద్యుత్ చార్జీలపై ముఖ్యమంత్రి జగన్ మడమ తిప్పారు..! బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు
Somu Veerraju
Follow us on

Current Charges – AP: విద్యుత్ చార్జీల హామీపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీ.. కరోన కష్టకాలం లో కరెంట్ చార్జీలు పెంచి సామాన్యుడిపై పెను భారం మోపారన్నారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో ఐదేళ్ల క్రితం వాటి ఖర్చుల వ్యత్యాసం వసూళ్ల కోసం ఇప్పుడు వసూళ్లకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలకు కరెంటు బిల్లులకు లింకు పెట్టిన నేపధ్యంలో ఈ అదనపు భారం వల్ల పింఛన్లు కోల్పోతామన్న భయంతో లబ్ధిదారులు ఉన్నారని సోము వ్యాఖ్యానించారు. 3,800 కోట్ల రూపాయలు వరకు సర్దుబాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ మీటర్ ఉన్న ప్రతి ఇంటి మీద చార్జీల భారం వేస్తున్నారని సోము విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థల వైఫల్యాలకు ప్రజలు ఎలా బాధ్యత వహిస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాష్ట్రంలో విద్యుత్ వినిమయం తగ్గినా ఇతర కారణాలు చూపిస్తూ విద్యుత్ సంస్థలు మరోసారి ఈ అదనపు వ్యయాన్ని సామాన్యుని పై రుద్దేందుకు చూస్తున్నాయని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ సంస్థలు సర్దుబాటు పేరుతో అదనంగా విధిస్తున్న ఆర్ధిక భాగాన్ని ప్రభుత్వమే భరించాలని సోము వీర్రాజు ఇవాళ అమరావతిలో డిమాండ్ చేశారు. వినియోగదారులకు భారం వేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సోము వీర్రాజు పేర్కొన్నారు.

Read also: Drugs Case: తొమ్మిది గంటలపాటు నవదీప్‌ను విచారించిన ఈడీ.. అందుబాటులోనే ఉండాలంటూ ఆదేశాలు