కోడెలనే పెద్ద గజదొంగ అని.. ఆయన ఇంట్లోనే దొంగతనం జరిగిందా..? అంటూ కోడెలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పెద్ద దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకే చిన్న దొంగతనం అనే నాటకం ఆడారని ఆయన ఆరోపించారు. గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ వాళ్లు సత్తెనపల్లిలో కంప్యూటర్ శిక్షణ కోసం కంప్యూటర్లు తెచ్చపెడితే.. వాటిని కోడెల కుటుంబసభ్యులు కాజేశారని అంబటి విమర్శించారు. దీనిపై విచారణ జరుగుతుందని తెలుసుకొని.. ఈ నాటకం మొదలుపెట్టారని అంబటి మండిపడ్డారు.
అసెంబ్లీ ఫర్నీచర్‌ను కోడెల కుమారుడికి చెందిన హీరో హోండా షోరూమ్‌లో ఉండటమేంటని ఆయన ప్రశ్నించారు. కోడెల చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని అంబటి హెచ్చరించారు. సత్తెనపల్లిలో కోడెల, ఆయన కుమారుడిపై కేసులు పెట్టింది టీడీపీ వారేనని.. వారు చేసిన పాపాలే వారిని వెంటాడుతున్నాయని అంబటి ఫైర్ అయ్యారు.