
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తొలిసారిగా రాజ్‌భవన్‌లో తన 85వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. గిరిజన, దళిత చిన్నారుల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. రాజ్‌భవన్‌లో ఉదయాన్నే ఆయనకు తిరుమల తిరుపతి, కనకదుర్గమ్మ దేవస్థానాల వేదపండితులు ఆశీర్వచనం అందించనున్నారు. అనంతరం కేక్ కట్ చేసి, చిన్నారులందరికీ కొత్త బట్టలు, పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉండటంతో.. ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు. అనంతరం ఆంధ్రా లయోలా యూనివర్సిటీలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, మొక్కలు నాటనున్నారు.