Amaravati: ఇక అమరావతే శాశ్వతం.. చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్.. డైరెక్ట్ గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు..

|

Nov 27, 2024 | 9:58 AM

ఇకపై రాజధాని విషయంలో అపోహలు తొలగిపోయేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో ఇకపై ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు తీసుకుంటోంది. రాజధానిపై కేంద్రం నుంచి గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

Amaravati: ఇక అమరావతే శాశ్వతం.. చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్.. డైరెక్ట్ గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు..
Andhra Pradesh Capital
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. మంత్రి నారాయణ దగ్గరుండి రాజధాని పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే అన్ని రకాల వివాదాలకు ముగింపు పలికేలా చట్టబద్దమైన నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇకపై ఏపీ రాజధాని అమరావతిపై ఎలాంటి అపోహలు లేకుండా ఉండేలా.. శాశ్వత రాజధానిగా అమరావతే ఉండేలా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో సమస్య మళ్లీ ఉత్పన్నం కాకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేసేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి గెజిట్ రప్పించే యత్నాలు చేస్తున్నారు. గెజిట్ అంశంపై పురపాలక శాఖ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు.

రాజధాని నిర్మాణం రుణానికి కేంద్రం గ్యారంటీ

రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధాని గడువు జూన్‌2తో పూర్తైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదానికి ముగింపు పలకాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఈ ఏడాది దాదాపు 15వేల కోట్ల రుపాయలను అంతర్జాతీయ సంస్థల ద్వారా రుణంగా ఇప్పించేందుకు గ్యారంటీ ఇస్తోంది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో ఏపీ రాజధానిని నోటిఫై చేయాలనే షరతు విధించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా పలు భవనాలకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తిచేశారు.

5 ఐకానిక్ టవర్లకు సంబంధించి డిజైన్ కాంట్రాక్ట్ నారిమన్ ఫాస్టర్ కంపెనీకి ఇచ్చినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. మరోవైపు అమరావతి పనులపై వరుస సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీకి అమరావతే రాజధాని అని కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా గెజిట్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..