ఏపీ కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వద్ద జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తాజాగా సీఎం జగన్ మంత్రులకు శాఖలు కేటాయించారు.
ఏపీలో కొత్త కేబినెట్ కొలువు దీరింది. 25 మంది మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం సందడిగా సాగింది. అంబటి రాంబాబు(Ambati Rambabu) నుంచి మొదలు పెట్టి విడదల రజని(Vidadala Rajini) వరకు మంత్రులు ప్రమాణం చేశారు. ముగ్గురు మాత్రమే ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. ఆదిమూలపు సురేష్(Adimulapu Suresh), ఉషశ్రీ చరణ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఇంగ్లీష్‌లో ప్రమాణం స్వీకారం చేశారు. మిగిలిన వారంతా తెలుగులోనే చేశారు. ఆ తర్వాత సీఎం జగన్‌కు, గవర్నర్‌కు ధన్యవాదాలు చెప్పారు. చాలా మంది సీఎం జగన్ కాళ్లకు నమస్కారం చేశారు. ప్రమాణం తర్వాత కొత్త మంత్రులతో గ్రూప్ ఫొటో దిగారు సీఎం జగన్, గవర్నర్ హరిచందన్. కాగా ఏపీ మంత్రులుకు సీఎం జగన్ శాఖలు కేటాయించారు. ఏపీ కేబినెట్‌లో ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఉండనున్నారు. రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషా, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామిలకు ఉప ముఖ్యమంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు.