Balayya: మల్టీస్టారర్‌‌పై బాలయ్య కీలక స్టేట్మెంట్.. ఏపీలో టికెట్ ధరలపై తన మార్క్ కామెంట్స్

|

Dec 15, 2021 | 10:07 AM

బెజవాడలో 'అఖండ' మూవీ యూనిట్ సందడి చేసింది. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శించుకున్నారు.

Balayya: మల్టీస్టారర్‌‌పై బాలయ్య కీలక స్టేట్మెంట్.. ఏపీలో టికెట్ ధరలపై తన మార్క్ కామెంట్స్
Balayya
Follow us on

బెజవాడలో ‘అఖండ’ మూవీ యూనిట్ సందడి చేసింది. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శించుకున్నారు.  ‘అఖండ’ మూవీ ఘనవిజయం సాధించడం పట్ల బాలయ్య ఆనందం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని చూపించిన సినిమా ‘అఖండ’ అని.. అమ్మవారి ఆశీస్సులతో ప్రేక్షకులు విజయాన్ని అందించారని బాలకృష్ణ పేర్కొన్నారు. ‘అఖండ’ విడుదలై ఘన విజయం సాధించాక నిర్మాతలకు ధైర్యం వచ్చిందన్న బాలయ్య.. అందరూ సినిమాలు విడుదల చేసేందుకు..ముందుకొస్తున్నారని వివరించారు. దర్శకులు ముందుకొచ్చి మంచి కథ తెస్తే.. మల్టీస్టారర్‌ చేస్తానని తెలిపారు. ‘అఖండ’  సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకి కృతజ్ఞతలు తెలిపారు బాలయ్య.

ఏపీలో టికెట్‌ రేట్లపై, ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టికెటింగ్ విధానంపై హీరో బాలకృష్ణ మాట్లాడారు. టికెట్‌ రేట్లపై ప్రభుత్వం సుప్రీంకు వెళ్తే.. నిర్మాతలు కూడా వెళ్తారని బాలకృష్ణ చెప్పారు. తాము అన్నింటికీ సిద్ధమయ్యే సినిమా విడుదల చేశామని.. టికెట్‌ ధరలపై హైకోర్టు తీర్పు రాకున్నా ధైర్యంతో అఖండ రిలీజ్‌ చేసినట్లు తెలిపారు. న్యాయ నిర్ణీత దేవుడే.. దేవుడున్నాడని చెప్పుకొచ్చారు. చిత్ర పరిశ్రమను తప్పకుండా కాపాడతామని బాలయ్య తెలిపారు.

అంతకుముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో నటసింహం  బాలకృష్ణ, అఖండ సినిమా టీమ్‌కు బొర్రా గాంధీ, కరుణాకర్ బృందం స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో బాలయ్యతో సెల్ఫీలు తీసుకొనేందుకు ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్ ఎగబడ్డారు.

Also Read: టీమ్‌ఇండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. టెస్టులకు జడేజా గుడ్‌బై!

ఆ సంస్థలతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం.. రైతులకు చేకూరనున్న ప్రయోజనం