Andhra Pradesh: మళ్లీ అదే సస్పెన్స్.. చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వడంపై తీర్పును వాయిదా వేసిన కోర్టు..

సీఐడీ కస్టడీ పిటిషన్‌పై మళ్లీ అదే ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం వస్తుందనుకున్న తీర్పు విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు న్యాయమూర్తి. తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణకై 5 రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌ వేయగా.. ఇరు పక్షాల వాదనలు ధర్మాసనం.. తొలుత సాయంత్రం తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే, సాయంత్రం తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు జడ్జి.

Andhra Pradesh: మళ్లీ అదే సస్పెన్స్.. చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వడంపై తీర్పును వాయిదా వేసిన కోర్టు..
Chandrababu(File Photo)

Updated on: Sep 21, 2023 | 5:38 PM

సీఐడీ కస్టడీ పిటిషన్‌పై మళ్లీ అదే ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం వస్తుందనుకున్న తీర్పు విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు న్యాయమూర్తి. తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణకై 5 రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌ వేయగా.. ఇరు పక్షాల వాదనలు ధర్మాసనం.. తొలుత సాయంత్రం తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే, సాయంత్రం తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు జడ్జి. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించింది ధర్మాసనం.

ఇదిలాఉంటే.. కోర్టు తీర్పు వెలువరించనుందనే ప్రచారం నేపథ్యంలో కుంచనపల్లి ఏసీబీ కోర్టు దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విజయవాడ ఏసీబీ కోర్టు ఏం తీర్పు ఇస్తుంది? అని ఉత్కంఠ అందరిలో నెలకొనగా.. తీర్పును రేపటికి వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయించడంతో.. అంతా సైలెంట్ అయ్యారు. కాగా, స్కిల్‌ స్కాంలో చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో బుధవారం వాడీవేడీగా వాదనలు కొనసాగాయి. కస్టడీకి ఇవ్వాలని ఇటు ఏఏజీ.. అటు న్యాయవాది లూథ్రా.. న్యాయమూర్తి ఎదుట సుదీర్ఘంగా బలమైన వాదనలు వినిపించారు. దీనిపై ఎలాంటి తీర్పు రాబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

సీఐడీ తరపున, ఇటు బాబు తరపున వాదనలు ఎలా జరిగాయో ఓసారి చూద్దాం..

స్కిల్ డెవలప్‌మెంట్‌ పరుతో అప్పట్లో రూ. 371 కోట్ల మేర స్కామ్ జరిగిందంటోంది సీఐడీ. కానీ.. అవినీతి ఆరోపణలు మాత్రమే, ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు బాబు తరపు న్యాయవాదులు. స్కామ్‌లో ప్రధాన ముద్దాయి చంద్రబాబే అని సీఐడీ అంటే.. అలాంటప్పుడు అసలు ఎఫ్‌ఐఆర్‌లో పేరు ఎందుకు లేదని ప్రశ్నించారు బాబు తరపు అడ్వకేట్స్‌. స్కామ్‌కి సంబంధించి ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉందని వాదించింది సీఐడీ. అసలు కేసే తప్పంటోంది బాబు వర్గం. 5 రోజుల కస్టడికి ఇవ్వాలని సీఐడీ అంటే.. రాజకీయ కక్ష సాధింపు కోసం అడుగుతున్నారని, కస్టడీకి ఇవ్వొద్దని వాదించారు బాబు తరఫున అడ్వకేట్స్.

చంద్రబాబును కస్టడీకి కోరుతూ ఏఏజీ పొన్నవోలు కూడా వాదనలు వినిపించారు. ఆన్ని ఆధారాలతోనే అరెస్ట్ జరిగిందని.. కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరిని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడమే అసలు ఉద్దేశమన్నారు. చంద్రబాబును కస్టడీకి ఇస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏఏజీ వాదించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..