Andhra Pradesh: చీరలతో పంట పొలాల అలంకరణ.. అసలు విషయం ఏమిటంటే..

|

Nov 20, 2022 | 5:07 PM

పచ్చని పంట పొలాలను రంగు రంగుల చీరలతో అలంకరించారు రైతులు. కోతకొచ్చిన పంట పైరగాలికి ఊగుతూ ఉంటే వాటిని మరింత శోభాయమానం చేస్తున్నాయి ఈ చీరలు. పంటచేలు ఎంటి... చీరలేంటి అనుకుంటున్నారా.. అవును రైతన్నలు తమ పంటను అడవి..

Andhra Pradesh: చీరలతో పంట పొలాల అలంకరణ.. అసలు విషయం ఏమిటంటే..
Sarees
Follow us on

పచ్చని పంట పొలాలను రంగు రంగుల చీరలతో అలంకరించారు రైతులు. కోతకొచ్చిన పంట పైరగాలికి ఊగుతూ ఉంటే వాటిని మరింత శోభాయమానం చేస్తున్నాయి ఈ చీరలు. పంటచేలు ఎంటి… చీరలేంటి అనుకుంటున్నారా.. అవును రైతన్నలు తమ పంటను అడవి పందులబారినుంచి కాపాడుకోడానికి వినూత్నంగా ఆలోచించారు. కూటికోసం కోటి విద్యలు అన్నట్టు దేశ ప్రజల ఆకలి తీర్చే రైతన్న ఆ పంటను కాపాడుకోడానికి ఎన్నో పాట్లుపడుతున్నాడు. తాజాగా కోతకొచ్చిన పంటను అడవి పందులనుంచి కాపాడుకోడానికి చేను చుట్టూ చీరలతో కంచె వేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా లోని పశ్చిమ ప్రాంతంలో కరువు కాటకాలతో, నీటి ఎద్దడితో ఆరు గాలం కష్టం చేసినా సరైన దిగుబడి లేక రైతులు నష్ట పోతూనే ఉంటారు. అయినా వ్యవసాయం పై మమకారం చావని రైతులు అష్టకష్టాలు పడి సాగుచేస్తూ ఉంటారు. వీటికి తోడు రాత్రి పూట అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి పంటలను సర్వనాశనం చేస్తుంటాయి, వాటిభారీ నుండి పంటలను రక్షించుకోవడానికి ఇలా చీరల అలంకరణ చేశామని స్థానిక రైతులు చెబుతున్నారు.

యర్రగొండపాలెం, పుల్లలచెరువు, దోర్నాల, పెద్దారవీడు మండలాల్లోని నల్లమల అడవికి సమీపంలో ఉండే గ్రామాల్లోని రైతులు తమ బొప్పాయి, అరటి, మిర్చి పంటలను అడవి పందుల భారీ నుండి కాపాడుకునేందుకు పంట పొలాల చుట్టూ చీరల తో కంచెలా ఎర్పాటు చేసుకున్నారు. అలా చేసుకోవడం వలన పంటలకు పందుల బెడద ఉండదని, లేదంటే లక్షల రూపాయలు ఖర్చు చేసి పండించిన పంటలు చేతికి రావని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.

అదేవిధంగా రాత్రి పూట పంట పొలాలకు కాపలా వెళ్ళే రైతుల పై కూడా పందులు దాడి చేస్తుంటాయని, పొలం చుట్టూ చీరలు కట్టుకుంటే కాపలా కు వెళ్ళాల్సిన అవసరం ఉండదంటున్నారు. దాంతో తమప్రాణాలు పంట సురక్షితంగా ఉంటాయంటున్నారు రైతులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..