AP News: 30 మంది విద్యార్ధులతో వెళ్తున్న స్కూల్‌ బస్సు.. కళ్లముందే క్షణాల్లో దగ్ధం! ఆ తర్వాత..

బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి 30 మంది విద్యార్థులతో బయలుదేరిన ఓ స్కూల్‌ బస్సు అనూహ్యంగా అగ్నికి ఆహుతైంది. డ్రైవర్‌ అప్రమత్తతో విద్యార్ధుల ప్రాణాలు దక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ షాకింగ్‌ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందంటే..

AP News: 30 మంది విద్యార్ధులతో వెళ్తున్న స్కూల్‌ బస్సు.. కళ్లముందే క్షణాల్లో దగ్ధం! ఆ తర్వాత..
School Bus Caught Fire In Anantapu

Updated on: Jan 29, 2026 | 7:21 AM

బుక్కరాయసముద్రం, జనవరి 29: ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో స్కూల్‌ బస్సుల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి 30 మంది విద్యార్థులతో బయలుదేరిన ఓ స్కూల్‌ బస్సు అనూహ్యంగా అగ్నికి ఆహుతైంది. డ్రైవర్‌ అప్రమత్తతో విద్యార్ధుల ప్రాణాలు దక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ షాకింగ్‌ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందంటే..

జిల్లాలోని పుట్లూరులోని శ్రీరామ్‌ గ్లోబల్‌ పాఠశాల బస్సు డ్రైవర్‌ బుధవారం సాయంత్రం 30 మంది విద్యార్థులను స్కూల్‌ నుంచి ఎక్కించుకుని వారి ఇళ్ల వద్ద దించడానికి బయల్దేరాడు. ఈ క్రమంలో కడవకల్లు గ్రామానికి బయలుదేరి వెళ్తుండగా.. మార్గంమధ్యలో చింతకుంట గ్రామ శివారులో గేర్‌బాక్సులో సమస్యలు తలెత్తాయి. దీంతో డ్రైవర్‌ బస్సును ఆపి, విద్యార్థులను కిందకు దించాడు మరమ్మత్తు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల్లో బస్సు అంతా మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్‌ ప్రమాదానికి ముందే పసిగట్టి బస్సులోని విద్యార్థులను కిందకు దింపడంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. లేదంటే ఊహకందని పెను ప్రమాదం జరిగేది.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రైవేటు పాఠశాలల బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకున్నా వాటికి అనుమతి ఇవ్వడంతో.. ఇష్టారీతిన విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. అధికారులు స్పందించి ఇటువంటి బస్సులకు అనుమలి నిరాకరించడం ద్వారా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. తాజా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.