అనంతపురంలోని చంద్ర హాస్పిటల్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. లిఫ్ట్ తెగిపడి అశ్వర్థప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అశ్వర్థప్ప సత్యసాయి జిల్లా వాసి. చంద్ర హాస్పిటల్‌లో ఉన్న బంధువులను చూసేందుకు వచ్చాడు అశ్వర్థప్ప.. నాలుగో ఫ్లోర్‌లో ఉన్న అతడు లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు.అయితే సడన్‌గా లిఫ్ట్ డోర్ తెరుచుకుంది..లిఫ్ట్ వచ్చిందనుకుని లోపలికి కాలు పెట్టాడు..అయితే లిఫ్ట్ రాలేదు..అప్పటికే అశ్వర్థప్ప కాలు లోపలికి పెట్టడంతో నాల్గొవ ఫ్లోర్ నుంచి అమాంతం గ్రౌండ్ ఫ్లోర్‌లో పడి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు..ఈ లిఫ్ట్ ప్రమాదం దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.
(ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలిచివేయవచ్చు)
అయితే అసలు లిఫ్ట్ రాకుండా డోర్ ఎందుకు తెరుచుకుందనే అనుమానం వ్యక్తమవ్వుతోంది..సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే లిఫ్ట్ రాకుండానే లిఫ్ట్ గేటు తెరుచుకుందని అశ్వర్ధప్ప కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు… పది రోజుల క్రితమే లిఫ్ట్ మెయింటెనెన్స్ చేపించామని సిబ్బంది చెబుతున్నారు.. మరీ లిఫ్ట్ ఫోర్త్ ఫ్లోరుకు రాకుండా గేటు ఎలా ఓపెన్ అవుతుందని బంధువులు ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..