AP News: పైకేమో పేరుకు బడాబాబులు.. తిప్పి చూస్తే.. జరిగేది చీర మాటున చెడుగుడు యవ్వారం.!

నార్పల మండలం కేసేపల్లి గ్రామంలో పట్టు చీరల కొనుగోలు కోసం అంటూ వచ్చిన దొంగల ముఠా లక్షా యాభై వేల రూపాయల విలువ చేసే పట్టుచీరలను ఎత్తుకెళ్లారు. ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఇన్నోవా కారులో కేసేపల్లికి వచ్చారు. పెళ్లి ఉందంటూ విలువైన పట్టు చీరలు చూపించమని..

AP News: పైకేమో పేరుకు బడాబాబులు.. తిప్పి చూస్తే.. జరిగేది చీర మాటున చెడుగుడు యవ్వారం.!
Representative Image

Edited By:

Updated on: Dec 01, 2023 | 12:43 PM

నార్పల మండలం కేసేపల్లి గ్రామంలో పట్టు చీరల కొనుగోలు కోసం అంటూ వచ్చిన దొంగల ముఠా లక్షా యాభై వేల రూపాయల విలువ చేసే పట్టుచీరలను ఎత్తుకెళ్లారు. ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఇన్నోవా కారులో కేసేపల్లికి వచ్చారు. పెళ్లి ఉందంటూ విలువైన పట్టు చీరలు చూపించమని మూడు చోట్ల పట్టు చీరల కోసం గాలం వేశారు. ఒక వ్యాపారి దగ్గర జనం ఎక్కువగా ఉండడంతో అక్కడ దొంగతనం చేయడానికి సాధ్యపడలేదు. మరో వ్యాపారి దగ్గర సీసీ కెమెరాలు ఉండటం గమనించి అక్కడ కూడా దొంగతనం చేయకుండా మళ్లీ వస్తామని చెప్పి జారుకున్నారు. మరో చీరల వ్యాపారి కేశవరెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు లేవు.. ఇంట్లో ఆయన భార్య తప్ప ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత చీరల కోసం లోపలికి వచ్చారు ఈ కేటుగాళ్లు.

కేశవరెడ్డి భార్య జానకిని మాటలతో ఏమార్చి లక్షా యాభై వేల రూపాయలు విలువ చేసే పట్టు చీరలు దొంగిలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చక్కగా చీరలు కట్టుకుని ఫ్యామిలీ లేడీస్‌లా వచ్చిన ఆ మహిళలు.. పెళ్లి ఉందని చెప్పి.. ఖరీదైన పట్టు చీరలు చూపించమని అడగడంతో.. భలే మంచి గిరాకీ వచ్చిందనుకుంది చీరల వ్యాపారి కేశవరెడ్డి భార్య జానకి. షాపులో ఉన్న ఖరీదైన పట్టు చీరలన్నీ ఆ మహిళల ముందు పరిచింది. ఇక్కడే ఆ కిలాడీలు తమ ప్లాన్ అమలు చేశారు. మంచి నీళ్లు కావాలని అడగడంతో.. ఇంట్లోకి వెళ్లిన జానకి.. తిరిగి వచ్చే లోపు.. చీరలతో ఉడాయించారు. అంతకుముందు వేరే షాపులోకి వెళ్లి వచ్చిన కిలాడీల దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా లేడీ కిలాడీల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వీడియో: 1

 

 

వీడియో: 2