Andhra Temples: ఏపీలోని టెంపుల్స్‌కి కేంద్రం బంపర్‌ ఆఫర్‌.. ప్రషాద్‌లో స్కీమ్‌లో ఆ 4 ఆలయాలు

|

Feb 03, 2022 | 4:11 PM

AP Temples: ఏపీలోని టెంపుల్స్‌కి కేంద్రం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ప్రముఖమైన నాలుగు ఆలయాలకు ప్రషాద్‌లో స్కీమ్‌లో ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది.

Andhra Temples: ఏపీలోని టెంపుల్స్‌కి కేంద్రం బంపర్‌ ఆఫర్‌..  ప్రషాద్‌లో స్కీమ్‌లో ఆ 4 ఆలయాలు
Annavarm Temple
Follow us on

దేశ వ్యాప్తంగా ఉన్న పురాతన ఆలయాలు, చారిత్రక ప్రదేశాల అభివృద్ధికి కేంద్రం ఎక్కువ ప్రధాన్యత ఇస్తోంది. ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ టూరిస్టు కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. దీనికోసం కేంద్రం ప్రషాద్‌ అనే పేరుతో కొత్త స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో చేర్చిన టెంపుల్స్‌కి ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది కేంద్రం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు ఆలయాలను అభివృద్ధి చేస్తున్న కేంద్రం.. ఏపీలోని నాలుగు ఆలయాలకు చోటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అమరావతి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం ఆలయాలను ఈ స్కీమ్‌లో అభివృద్ది చేస్తున్నట్టు ప్రకటించింది. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గతంలోనే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆలయాలను ప్రషాద్‌ స్కీమ్‌లో చేర్చామని తెలిపారు. ఈ స్కీమ్‌లో భాగంగా 2015-16లో అమరావతికి 27కోట్ల 77 లక్షలతో పర్యాటక గమ్యస్థానం కింద అభివృద్ధి పనులు చేశామని మంత్రి తెలిపారు. ప్రముఖ శివాలయం శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయం అభివృద్ధి కోసం 37కోట్ల 88 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, సింహాచలం, అన్నవరం ఆలయాలకు కూడా నిధులు కేటాయించామన్నారు. ఈ నిధుల కింద చేపడుతున్న అభివృద్ధి పనులతో ఆలయాల్లో మెరుగైన వసతులు ఏర్పడుతున్నాయి. పలు చోట్ల ఆధునీకరణ పనులు కూడా చేపడుతున్నారు.

Also Read:  మాకేదీ వినిపించదు..మాటలు కూడా రావు..! నమ్మారో ఇక అంతే!!