Andhra: బాబోయ్.. 15 అడుగులు.. కారు చీకట్లో బుసలు కొట్టిన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే

పార్వతీపురం మన్యం జిల్లాలో కింగ్ కోబ్రా హాల్ చల్ చేసింది. గ్రామంలో అకస్మాత్తుగా ప్రత్యక్షం కావడంతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సాలూరు మండలం తుండ గ్రామంలో ఆదివారం సాయంత్రం జనావాస ప్రాంతంలో భారీ కింగ్ కోబ్రా కనిపించడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Andhra: బాబోయ్.. 15 అడుగులు.. కారు చీకట్లో బుసలు కొట్టిన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే
King Cobra News

Edited By:

Updated on: Mar 15, 2026 | 1:21 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో కింగ్ కోబ్రా హాల్ చల్ చేసింది. గ్రామంలో అకస్మాత్తుగా ప్రత్యక్షం కావడంతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సాలూరు మండలం తుండ గ్రామంలో ఆదివారం సాయంత్రం జనావాస ప్రాంతంలో భారీ కింగ్ కోబ్రా కనిపించడం కలకలం రేపింది. గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఆరుబయట కూర్చొని మాట్లాడుకుంటుండగా సుమారు పదిహేను అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా ఒక్కసారిగా వారి మధ్యకు వచ్చింది. పామును చూసిన వెంటనే అక్కడున్న వారంతా భయంతో అటు ఇటు పరుగులు తీశారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

King Cobra Snake

గ్రామస్తుల కదలికలు, అరుపులతో ఆ పాము మరింత ఆగ్రహానికి గురై బుసలు కొడుతూ పైకి లేస్తూ భీభత్సం సృష్టించింది. చాలా పొడవుగా ఉన్న కింగ్ కోబ్రా గ్రామంలో సంచరిస్తుండటంతో ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పలువురు స్థానికులు అప్రమత్తమై కర్రలు, దిమ్మెలతో పామును తరిమేందుకు ప్రయత్నించారు. అయితే అది మరింతగా బుసలు కొడుతూ దాడి చేసేలా ప్రవర్తించడంతో గ్రామస్థులు భయంతో కర్రలతో కొట్టి చంపారు.

వీడియో చూడండి..

ఘటన తరువాత కొంతసేపు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని చనిపోయిన కింగ్ కోబ్రాను చూసేందుకు గుమ్మిగూడారు. అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల్లో ఇలాంటి విషపాములు తరచుగా కనిపిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us