King Cobra: అయ్యా బాబోయ్‌.. 12 అడుగుల కింగ్ కోబ్రా.. టాయిలెట్‌లో తిష్టవేసింది

గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న మరుగుదొడ్డి వద్ద కింగ్ కోబ్రా బుసలు కొడుతూ కనిపించింది. దీంతో ఇంటి సభ్యులు,స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు‌.

King Cobra: అయ్యా బాబోయ్‌.. 12 అడుగుల కింగ్ కోబ్రా.. టాయిలెట్‌లో తిష్టవేసింది
Large Size Of King Cobra

Updated on: Sep 16, 2022 | 11:39 AM

King Cobra: అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం కాశీపురం శివారు గ్రామం లక్ష్మీపేట గ్రామంలో భారీ కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. ఒకటి కాదు, రెండు కాదు… 12 అడుగుల కింగ్‌ కోబ్రా గ్రామస్తుల్ని వణికించింది. గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న మరుగుదొడ్డి వద్ద కింగ్ కోబ్రా బుసలు కొడుతూ కనిపించింది. దీంతో ఇంటి సభ్యులు,స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు‌. వెంటనే వన్యప్రాణి సంరక్షణ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో ఈస్ట్రన్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులు మూర్తి, వెంకటేశ్ అక్కడికి చేరుకున్నారు.

మరుగుదొడ్డిలో ఉన్న కింగ్ కోబ్రాను బయటకు తీసుకువచ్చి చాకచక్యంగా బంధించారు.. అనంతరం ఫారెస్ట్ అధికారులతో కలిసి కింగ్ కోబ్రాని వంట్లమామిడి సమీపంలో అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. కింగ్ కోబ్రాను పట్టుకోవడంతో గ్రామస్తులు హమ్మయా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి