AP News: కారు నెంబర్ ప్లేట్ చూసి బిత్తరపోయిన పోలీసులు.. తనిఖీ చేయగా..

| Edited By: Ravi Kiran

Jan 03, 2025 | 1:45 PM

అనకాపల్లి జిల్లాలో ఓ కారు నెంబర్ ప్లేట్ పోలీసులకు ఆలోచనలో పడేసింది.. ఎందుకంటే ఆ కారుకు ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ఏపీ ది... దాని ఆధారంగా వివరాలు ఆరా తీస్తే సరిపోలడం లేదు.. ఏమిటబ్బా ఈ కన్ఫ్యూజన్ అని డ్రైవర్ను ప్రశ్నిస్తే..

AP News: కారు నెంబర్ ప్లేట్ చూసి బిత్తరపోయిన పోలీసులు.. తనిఖీ చేయగా..
Representative Image
Follow us on

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు వద్ద ఓ కారు అనుమానాస్పదంగా ఉంది. ఓ లాడ్జ్ సమీపంలో కారును పార్క్ చేసి పెట్టారు. కారులో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. వారిని ప్రశ్నిస్తే రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ఎందుకు వచ్చారు అనే ఆరా తీస్తే పొంతనలేని సమాధానం చెప్పారు. అయితే కారుకు ఏపీ రిజిస్ట్రేషన్ తో నెంబర్ ప్లేట్ ఉంది.. కానీ అందులో ఉన్నది రాజస్థాన్ కు చెందిన వాళ్లు. దీనిపై కూపీ లాగారు పోలీసులు. ఈలోగా కారును అనుమానంతో చెక్ చేస్తే.. 22 ప్యాకెట్లు కనిపించాయి. వాటిలో 110 కిలోల గంజాయి ఉంది. కారుకు ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ వివరాలపై ఆరా తీసిన పోలీసులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. విషయం ఏంటంటే రాజస్థాన్ రిజిస్ట్రేషన్ తో ఉన్న కారు నెంబర్ ప్లేట్ పై ఏపీకి చెందిన మరో రిజిస్ట్రేషన్ నెంబరు ప్లేటును అమర్చారు. ఆన్లైన్లో ఆరా తీసి ప్రశ్నిస్తే అసలు గుట్టు బయటపడింది. ఒరిస్సా నుంచి గంజాయి కొనుగోలు చేసి రాజస్థాన్‌కు తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. కారును కోటవురట్ల ఎస్సై రమేష్, సీఐ రామకృష్ణ సీజ్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి