ఆ వీడియో చూసి ఆనంద్ మహీంద్ర కన్నీరు పెట్టుకున్నారు

Anand Mahindra shares heartwarming video of disabled kid eating with feet: Couldnot stop tears, ఆ వీడియో చూసి ఆనంద్ మహీంద్ర కన్నీరు పెట్టుకున్నారు

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కంట కన్నీరు ఒలికింది. ఎన్నో రకాలుగా ఎంతో మందికి సాయం చేసే గొప్ప దాతృత్వం ఆయనది. ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో చూసి కన్నీరు ఆపకోలేకపోయానంటూ ట్వీట్ చేసి ఆ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో పుట్టకతోనే రెండు చేతులు లేని ఓ చిన్నారి తన కాళ్లతో ఆహారం తీసుకుంటున్న దృశ్యం ఆనంద్ మహీంద్ర కళ్లలో కన్నీరు నింపింది. ఈ వీడియో చూడగానే ఎంతో చలించిపోయానని, అయితే శరీరంలో ఎన్ని లోపాలున్నా వాటిని అధిగమించి మనదైన రీతిలో తీర్చిదిద్దుకోవడం చూసి ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యిందని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇటీవలే తన మనవడి వద్దకు వెళ్ళి వచ్చానని, ఈ వీడియో చూస్తున్నప్పుడు తన మనవడే గుర్తుకు వచ్చాడని కూడా ఆయన తెలిపారు.

జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదిరించేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి కోవకు చెందిన వాడే ఈ పసివాడు. ఆనంద్ మహీంద్ర ఈ కదిలించిన వీడియో మీరూ చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *