Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతుల ఆందోళనపై ఏం చేద్దాం ? మంత్రులు రాజ్ నాథ్, తోమర్ లతో హోం మంత్రి అమిత్ షా చర్చలు

రైతుల ఆందోళనపై ఏం చేయాలన్న దానిపై హోం మంత్రి అమిత్ షా ఆదివారం రాత్రి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.

రైతుల ఆందోళనపై ఏం చేద్దాం ? మంత్రులు రాజ్ నాథ్, తోమర్ లతో  హోం మంత్రి అమిత్ షా చర్చలు
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Nov 30, 2020 | 10:30 AM

రైతుల ఆందోళనపై ఏం చేయాలన్న దానిపై హోం మంత్రి అమిత్ షా ఆదివారం రాత్రి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొన్న ఈ మీటింగ్ రెండు గంటలపైగా జరిగింది. ముఖ్యంగా ఢిల్లీకి దారి తీసే 5 పాయింట్లను మూసివేస్తామని రైతులు హెచ్చరించిన నేపథ్యంలో తాజా పరిస్థితిపై వీరు చర్చించారు.డిసెంబరు 3 న చర్చలకు రావాలని అమిత్ షా కోరినప్పటికీ ఎలాంటి ముందు షరతులు లేకుండా చర్చలు జరగాలంటూ ఈ ప్రతిపాదనను అన్నదాతలు తిరస్కరించారు. పైగా వీరు తమ ధర్నా స్థలాన్ని బురారీ పార్క్ లోని  నిరంకారీ మైదాన్ కు షిఫ్ట్ చేయాలన్న సూచనను కూడా వారు తోసిపుచ్చారు. వీరు రామ్ లీలా మైదానాన్ని కోరుతున్నారు.

అన్నదాతల ఆందోళనపై పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రుల మధ్య తలెత్తిన తగాదా గురించి కూడా అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, తోమర్ చర్చించారు. ఈ రెండు రాష్ట్రాల సీఎం ల మథ్య ట్విటర్ వార్  నడిచింది. ఒకరికొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. కాగా-ఢిల్లీకి దారి తీసే సోనీపట్, రోహతక్, జైపూర్, ఘజియాబాద్- హాఫుర్, మథుర మార్గాలను మూసివేస్తామని రైతులు అంటున్నారు. ప్రభుత్వం సూచించిన బురారీ పార్క్ కు తాము వెళ్లబోమని, అది ఓపెన్ జైలు అనడానికి తమవద్ద ఆధారాలు ఉన్నాయని భారతీయ కిసాన్ యూనియన్ ప్రెసిడెంట్ సుర్జిత్ ఫుల్ అన్నారు. ఉత్తరాఖండ్ రైతులను పోలీసులు అరెస్టు చేసి అక్కడ ఉంచారని ఆయన చెప్పారు.

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో