Breaking News
  • చిత్తూరు: మదనపల్లెలో మహిళా సంఘాల ఆందోళన. నిందితుడిని ఉరి తీయాలంటూ చిన్నారి వర్షిత తల్లిదండ్రుల ధర్నా. తమకు న్యాయం చేయాలంటున్న వర్షిత తల్లిదండ్రులు. రఫీని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్. విద్యుత్‌ టవర్‌ ఎక్కిన వర్షిత కుటుంబ సభ్యులు. కిందకు దించేందుకు పోలీసుల ప్రయత్నాలు.
  • వివాదంలో జార్జిరెడ్డి సినిమా. ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపణ. సినిమాలో జార్జిరెడ్డి రౌడీయిజాన్ని చూపెట్టాలన్న ఏబీవీపీ. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించిన పోలీసులు. ఈ నెల 22న విడుదల కానున్న జార్జిరెడ్డి.
  • వరంగల్‌: ఏనుమాముల మార్కెట్ యార్ట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం. ప్రభుత్వ హామీతో తిరిగి కొనుగోళ్లు ప్రారంభించిన కాటన్ వ్యాపారులు.
  • ఢిల్లీ చేరుకున్న ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌. సా.4గంటలకు సోనియాతో భేటీ కానున్న శరద్‌పవార్‌. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి కార్యాచరణపై చర్చ.
  • హైదరాబాద్‌: హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ. తాకట్టు పెట్టిన అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసిన బ్యాంకర్లు. సంవత్సరం గడిచినా కొనుగోలుదారులకు అందని కన్‌ఫర్మేషన్‌ ఆర్డర్. కన్‌ఫర్మేషన్‌ ఇవ్వాలని కోరిన బ్యాంకర్లు. డిసెంబర్‌ 5న మరోసారి విచారిస్తామన్న హైకోర్టు. తదుపరి విచారణ డిసెంబర్‌ 5కు వాయిదా.
  • లోక్‌సభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు. ప్రాంతీయ భాషా పరిరక్షణపై కేశినేని నాని ప్రశ్న. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలి-కేశినేని నాని. ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉంది-కేశినేని నాని. పలు అంశాలపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతున్న సభ. తెలుగు భాష ఉన్నతికి చర్యలు తీసుకుంటున్నాం-మంత్రి పోఖ్రియాల్‌.
  • ఆగ్రా జిల్లా పేరు మార్చే యోచనలో యూపీ సర్కార్. ఆగ్రా పేరును ఆగ్రావన్‌గా మార్చాలని యూపీ సర్కార్‌ యోచన. కాషాయికరణలో భాగంగా పేరు మారుస్తున్నారని విపక్షాల విమర్శలు. గతంలో ఫైజాబాద్‌ను అయోధ్యగా.. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన యూపీ సర్కార్.

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటి వారిని తరిమేస్తాం.. అమిత్ షా

ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా నిలుస్తారు మోడీషాలు. తాము సెట్ చేసుకున్న ఎజెండాకే పెద్ద పీట వేస్తూ.. తరచూ ఏదో ఒక హాట్ టాపిక్‌ను తెర మీదకు తీసుకొచ్చే ఈ ద్వయం ప్రస్తుతం ఎన్‌ఆర్‌సీ అంటూ పెద్ద సంచలనం సృష్టించారు. ఇక ఈ అంశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న వేళ.. దీనిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

2024 ఎన్నికల నాటికి దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారందరిని గెంటివేస్తామంటూ అమిత్ షా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం హర్యానా అసెంబ్లీకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కథియాల్ జిల్లాకు పర్యటించిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేయడంతో మరోసారి వివాదానికి తెర లేపారు.

70 ఏళ్లుగా అక్రమ వలసదారులు దేశ ప్రజలందరికి అందాల్సినవి అనుభవిస్తూ.. ధైర్యంగా బతుకుతున్నారని.. అలాంటివారిని దేశం నుంచి పంపించే సమయం దగ్గరపడిందన్నారు. 2024లో మరోసారి ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకువస్తామని.. అంతకుముందే.. ఈ అక్రమ వలసదారులు దేశంలో ఉండరని అమిత్ షా స్పష్టం చేశారు.

బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి నిర్ణయాలు దేశానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక రఫెల్ ఫైటర్ జెట్‌కు డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాధ్ సింగ్ చేసిన ఆయుధ పూజను హేళన చేసిన కాంగ్రెస్‌పై కూడా అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు.