వైట్ హౌస్ లో కరోనాకు అదే కారణమా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వైరస్‌ సోకిన తర్వాత ఆయన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో పదుల సంఖ్యలో ఉన్నతాధికారులు కరోనా బారినపడ్డారు.

వైట్ హౌస్ లో కరోనాకు అదే కారణమా..?
Follow us

|

Updated on: Oct 10, 2020 | 6:01 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వైరస్‌ సోకిన తర్వాత ఆయన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో పదుల సంఖ్యలో ఉన్నతాధికారులు కరోనా బారినపడ్డారు. వీరందరికీ కరోనా సోకడానికి కారణం ఏమై ఉంటుందోనని ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అంత పక్కాగా కరోనా నియంత్రణ చర్యలు చేపడుతున్న అగ్ర రాజ్యసౌధం వైట్ హౌస్ లోకి వైరస్ ఎలా ప్రవేశించిందని తర్జనభర్జనలు మొదలైంది. అయితే, ఈ ఊహాగాలనాలన్నింటికి తెరదించుతూ అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణులు, యూఎస్ కొవిడ్ కంట్రోల్ టీం మెంబర్ డాక్టర్ ఆంటోని ఫౌచీ కీలక విషయాలు వెల్లడించారు.

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్ బర్గ్ వారసురాలిగా ఎమీ కోని బారెట్ ను ప్రకటిస్తూ సెప్టెంబర్ 26న వైట్ హౌస్ లో భారీ కార్యక్రమం నిర్వహించారు అధ్యక్షులు ట్రంప్. ఈ సెలబ్రేషన్స్.. వైట్ హౌస్ సిబ్బంది కొంపముంచిందని ఫౌచీ తెలిపారు. ఈ సందర్భంగా ఎవరు కొవిడ్ నిబంధనలు పాటించలేదని, కనీసం మాస్కులు కూడా ధరించలేదన్నారు. అందుకే వైరస్ అధ్యక్షులు ట్రంప్ తోసహా చాలామందికి సోకిందన్నారు. వైట్‌హౌస్‌లో తొలుత ట్రంప్‌ సీనియర్‌ సలహాదారు హోప్‌ హిక్స్‌ కరోనా బారిన పడ్డారు. ఆమె అధ్యక్షుడికి సన్నిహితంగా మెలగడంతో ట్రంప్‌ దంపతులు పరీక్షలు చేయించుకున్నారు. ఆ టెస్టుల్లో వారికీ వైరస్‌ సోకినట్లు తేలింది. అనంతరం వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కేలీ మెకనీ, సలహాదారులు స్టీఫెన్‌ మిల్లర్‌‌, నికోలస్‌ లూనా సహా ట్రంప్‌తో సన్నిహితంగా మెలిగిన దాదాపు 12 మంది ఉన్నతాధికారులు సైతం కరోనా బారినపడ్డారు.

కాగా, కరోనా బారినపడి కోలుకున్న డోనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. శనివారం వైట్‌హౌస్ ఆవరణలో ప్రచార సభ నిర్వహిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించారు. దీని తర్వాత సోమవారం అధికారికంగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో యథావిధిగా పాల్గొంటానని ట్రంప్ వెల్లడించారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో