Shocking Video: 18వేల కిలోల బాంబు నడిసముద్రంలో పేలితే ఎట్టా ఉంటుందో తెలుసా..?.. వీడియో చూసెయ్యండి

|

Jun 22, 2021 | 6:10 PM

దీపావళి పండుగ సమయంలో పేల్చే లక్ష్మీ బాంబు శబ్దం అందరికీ గుర్తుండే ఉంటుంది. చిన్నపరిమాణంలో ఉండే ఈ టపాసు చేసే శబ్దంకు చెవి గూబ గుయ్య్‌ మంటుంది...

Shocking Video: 18వేల కిలోల బాంబు నడిసముద్రంలో పేలితే  ఎట్టా ఉంటుందో తెలుసా..?.. వీడియో చూసెయ్యండి
Massive Explosion
Follow us on

దీపావళి పండుగ సమయంలో పేల్చే లక్ష్మీ బాంబు శబ్దం అందరికీ గుర్తుండే ఉంటుంది. చిన్న పరిమాణంలో ఉండే ఈ టపాసు చేసే శబ్దంకు చెవి గూబ గుయ్య్‌ మంటుంది. కానీ అలాంటిది ఓ రియల్‌ బాంబ్‌ను బ్లాస్ట్‌ చేసిన్నప్పుడు, దాని నుంచి వచ్చే శబ్దంను ఓ సారి ఊహించుకోండి. వామ్మో ఇంకేమైనా ఉందా..! ఆ శబ్దంకే గుండె ఆగిపోయినంత పనవుతుంది. అయితే తాజాగా అట్లాంటిక్‌ మహా సముద్రంలో 18వేల కిలోల బాంబును పేల్చారు అమెరికా నౌకాదళ అధికారులు. ఈ బాంబును పేల్చిన సమయంలో, ఉవ్వెత్తున నీళ్లు ఎగిసిపడి, సముద్రం మొత్తం ఒక్కసారిగా అలజడికి గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది.

యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నౌకపై నుంచి అట్లాంటిక్ మహా సముద్రంలో తొలి పేలుడు పరీక్షను నిర్వహించింది అమెరికన్‌ నేవి. 18వేల 143 కిలోల బరువున్న బాంబును సముద్రం అడుగు భాగాన పేల్చింది. ఫుల్ షిప్ షాక్ ట్రయల్స్‌లో భాగంగా కొత్త నౌకలు ఇలాంటి బాంబు పేలుళ్ల ధాటికి ఎలా తట్టుకుంటాయో తెలుసుకునేందుకు, ఈ పరీక్షను నిర్వహించిన్నట్లు తెలిపారు నేవి అధికారులు. జలచరాలు, పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా ఈ పరీక్ష చేసినట్టు ప్రకటించింది అమెరికా నౌకాదళం. అయితే, ఈ పేలుడు ధాటికి సముద్రం నీళ్లు అల్లంత ఎత్తుకు ఎగిసిపడ్డాయి. దాని తరంగాలు చాలా దూరం వరకు విస్తరించాయి. ఈ పేలుడుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ షాకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కెయ్యండి…

Also Read: పెద్ద పులితో యువకుల పరాచకాలు.. అది ఏం చేసిందో మీరే చూడండి

 ఆ మహిళలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో నేరుగా నగదు జమ