అమెరికా పార్లమెంట్ భవనం-క్యాపిటల్ వద్ద స్వల్ప కాలం పాటు ఆంక్షలు విధించారు అధికారులు. దేశ నూతన అధ్యక్షుడిగా జనవరి 20న జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో వాషింగ్టన్ తోపాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో అల్లర్లు చెలరేగే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రత వర్గాలు అప్రమత్తమయ్యాయి.
అత్యంత పటిష్ట భద్రతాచర్యలతో వాషింగ్టన్‌ను అష్టదిగ్బంధనం చేశాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే కేంద్రానికి దారితీసే రహదారులను మూసేశారు.
బయటి వ్యక్తుల నుంచి భద్రత ముప్పు ఉన్న నేపథ్యంలో రాకపోకలను నిలిపివేశారు. బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమ రిహార్సల్స్‌లో పాల్గొన్న సిబ్బందిని వెంటనే భవనం నుంచి బయటకు పంపించారు. భవనానికి సమీపంలో అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.
వేలాది స్థానిక పోలీసులతో పాటు, సుమారు 25 వేల మంది నేషనల్ గార్డ్స్‌ను రంగంలోకి దింపారు. క్యాపిటల్ భవనం, వైట్‌హౌజ్‌లతో పాటు నగరంలోని ప్రధాన భవనాల్లో భద్రత ఏర్పాట్లు చేశారు. క్యాపిటల్ భవనం, వైట్‌హౌజ్‌ల్లోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధించారు.
ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్.. అమిత్‌షాతో భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ