అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎంతో ఆత్మీయంగా పెంచుకున్న శునకం పప్పి మృతి చెందింది. అత్యంత ప్రీతిపాత్రమైన పెంపుడు శునకం చనిపోవడంతో వైట్ హౌస్‌లోని వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. 2008వ సంవత్సరంలో తాను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్ చిన్న కూనగా ఉన్న ఈ పప్పిని ఓ జంతువుల వ్యాపారి నుంచి సేకరించారు. అప్పటి నుంచి అది బైడెన్ కుటుంబంలో ఓ భాగంగా మారిపోయింది. డెలావర్‌లోని బైడెన్ స్వగృహంతోపాటు శ్వేత సౌధంలోనూ ఛాంప్‌కు ప్రత్యేక స్థానం ఉండేది. కాగా, ఛాంప్ మృతితో బైడెన్ ఇంట ఉండే మరో శునకం మేజర్ ఒంటరిది అయ్యింది. బైడెన్ ప్రతిరోజు వాకింగ్‌కు వెళ్లే సమయంలో ఆ రెండు శునకాలను వెంట తీసుకెళ్లేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
తాము దుఃఖంలో ఉన్న రోజుల్లోనూ, ఆనందంగా ఉన్న సమయంలోనూ ఛాంప్ వారి వెంటే ఉందని తెలిపారు. తమ భావోద్వేగాల్లో భాగస్వామి అయ్యిందని బైడెన్ దంపతులు శనివారం ట్వీట్ చేసి దాని జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వయోభారం కారణంగానే శునకం మరణించినట్లు బైడెన్ ఫ్యామిలీ వెల్లడించింది. డెలావర్‌లో ఉన్న బైడెన్ స్వగృహంతో పాటు శ్వేతసౌధంలోనూ ఛాంప్‌కు ప్రత్యేక స్థానం ఉండేది.
ఇదిలావుంటే.. ట్రంప్ హయాంలో వైట్ హౌస్ లో పెంపుడు జంతువులకు అనుమతి లేదు. కానీ బైడెన్ అలాంటి విధానాలను మార్చేస్తున్నారు.