అమెరికాలో ఓ చైనా బెలూన్ తీవ్ర కలకలం రేపింది. ఆకాశంలో ఎగురుతున్న ఈ బెలూన్‌పై అమెరికా నిఘా వర్గాలు గుర్తించారు. ఆ బెలూన్ ఎక్కడి నుంచి వచ్చింది.? అందులో ఏమున్నాయనే దానిపై అమెరికా నిఘా వర్గాలు ఆపరేషన్ చేపట్టింది. ఎట్టకేలకు ఆ బెలూన్‌ను కూల్చివేయడంలో అందులో ఉన్న కీలక పరికరాలు బయటపడ్డాయి. ఈ చైనా బెలూన్ పై అమెరికాలో ప్రకంపనలు మొదలయ్యాయి. నిఘా బెలూన్‌కు సమాచారం సేకరించే సామర్థ్యం ఉందని నిపుణులు వెల్లడించారు. భారీ ఎత్తున కమ్యూనికేషన్ పరికరాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అమెరికాలో కలకలం రేపిన చైనా బెలూన్ విషయంలో అమెరికా భయాలు నిజమయ్యే అవకాశం ఉంది. కూల్చివేసిన చైనా బెలూన్‌లో కమ్యూనికేషన్ సంకేతాలను సేకరించగలిగే పరికరాలు ఉన్నట్లు తేల్చింది అమెరికా. దానిలో ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్‌కు అవసరమైన యాంటెన్నాలు ఉన్నాయని విదేశాంగశాఖ అధికారులు చెప్పారు. దీనిపై అమెరికా చట్టసభల్లో చైనా చర్యలను ఖండిస్తూ.. నాన్‌బైండింగ్ తీర్మానాన్ని ఆమోదించారు సభ్యులు. అమెరికా సార్వభౌమత్వాన్ని ఈ బెలూన్ ఉల్లంఘించిందన్న ఆరోపణలను సమర్థించారు సభ్యులు. సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రతినిధుల సభ 419-0 ఓట్లతో ఆమోదించింది.
ఎటువంటి నిఘా బెలూన్ల బృందం లేదని చైనా వివరణ ఇచ్చినప్పటికి.. అమెరికా ఒప్పుకోవడం లేదు. తమపై అమెరికా సమాచార, ప్రజాభిప్రాయ యుద్ధంలో భాగం కావచ్చని అన్నారు చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్. ఈమేరకు స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆ బెలూన్ హైరిజల్యూషన్ చిత్రాలను విడుదల చేశారు. దాదాపు 60 మీటర్ల పొడవున్న ఈ బెలూన్‌కు భారీ సోలార్ ప్యానెల్స్ వేలాడదీసి ఉండగా.. వివిధ ఇంటెలిజెన్స్ సేకరణ పరికరాలు కూడా ఉండే అవకాశాలున్నాయని అమెరికా అనుమానిస్తుంది. దీనికి ఉన్న యాంటెన్నాలు జియో లొకేషన్‌ను సేకరించగలవని అనుమానిస్తున్నారు. అమెరికాకు చెందిన స్ట్రాటజిక్ కమాండ్ అధీనంలోని 100 మినిట్‌మ్యాన్-3 క్షిపణుల నుంచి చైనా సమాచారం సేకరిస్తోందనే అనుమానాలు అమెరికా వ్యక్తం చేస్తుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి