అమెరికా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్నదానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయానికి అడుగు దూరంలో ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన రావడానికి ఇంకా సమయం పట్టేట్టుగా ఉంది.. ఇదిలా ఉంటే ఓటమి అంచుల్లో చిక్కుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇంకా గత్తరబిత్తర చేస్తున్నారు.. ఇక ఆయనకు మద్దతుగా సాగిన ఓ ర్యాలీలో కాల్పులు కూడా జరిగాయి.. ఫ్లోరిడాలోని ఫోర్డ్ లౌడెర్‌డేల్ ప్రాంతంలో నిన్న సాయంత్రం చేపట్టిన ర్యాలీ కాస్త ఉద్రిక్తలకు దారి తీసింది.. ఆ ర్యాలీలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు.. ర్యాలీ కోరల్ రిడ్జ్‌మాల్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఓ కారులో వచ్చిన ఆ వ్యక్తి కాల్పులు జరిపాడు.. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలు కూడా అయ్యాయి.. ర్యాలీని టార్గెట్ చేసుకున్నాడా గుర్తు తెలియని వ్యక్తి.. ఆయన ఎవరైంది? ఎక్కడ ఉంటుంది? ఇంకా తెలియరాలేదు.. పోలీసులు అదే పనిలో ఉన్నారు..